అఖిల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సాయేష సైగల్

అఖిల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సాయేష సైగల్

Published on Feb 28, 2015 12:53 PM IST

akhil-Sayesha
వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా సెకండ్ షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో జరిగిన షెడ్యూల్లో అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ చిత్రీకరించారు. ఈ రోజు మొదలైన షెడ్యూల్లో హీరోయిన్ సాయేష సైగల్ సినిమా టీంలో జాయిన్ అయ్యింది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తారు.

శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, యువ హీరో నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు. కోన వెంకట్ – గోపి మోహన్ రచనా సహకారంతో పాటు మాటలు రాస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకులు.

తాజా వార్తలు