విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే వెంకీ హీరోగా ‘దృశ్యం 2’ సినిమా జరుగుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తీసిన జీతూ జోసెఫ్ నే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడని తెలిగాయనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ‘దృశ్యం 2’ తెలుగు వర్షన్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు.. అలాగే వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్లు మార్పులు చేశారట.
ఇక గతేడాది లాక్డౌన్ కారణంగా కొన్ని సీన్ల షూటింగ్ విషయంలో ఆయన మలయాళం వర్షన్ కి సంబంధించి రాజీ పడ్డారు. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ లో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా.. పూర్తిగా కథకు న్యాయం చేసేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. తాను మొదట అనుకున్న కొన్ని సీన్లని ఈసారి మరింత పకడ్బందీగా, లావిష్ గా తీయాలని జీతూ జోసెఫ్ బడ్జెట్ ను కూడా కాస్త భారీగానే ఇచ్చినట్లు తెలుస్తోంది.


