వెంకటేష్ సినిమాకి హిట్ మూవీస్ రైటర్ కథ?

వెంకటేష్ సినిమాకి హిట్ మూవీస్ రైటర్ కథ?

Published on May 10, 2015 2:01 PM IST

venkatesh

విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమా జనవరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ హీరోగా చేయనున్న సినిమా గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొద్ది రోజుల క్రితం ఎన్.వి నిర్మల్ కుమార్, రవి బాబులతో వెంకటేష్ సినిమా చేయనున్నాడు అనే వార్తలు వచ్చినా, వాటిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ నటించబోయే తదుపరి సినిమాకి స్క్రిప్ట్ ఫైనలైజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడా ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలకు కథను అందించిన రైటర్ వెంకటేష్ సినిమాకి కథని సిద్దం చేసాడట. అతనెవరో కాదు.. ఆకుల శివ.. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన లక్ష్మీ, కృష్ణ, నాయక్ సినిమాలకు కథని అందించిన ఆకుల శివ వెంకటేష్ తదుపరి సినిమాకి కథని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కథా చర్చలు కొడై కెనాల్ లో జరుగుతున్నాయి. దాదాపు స్టొరీ ఫైనలైజ్ అయిపోయినట్లు సమాచారం. స్టొరీ మొత్తం ఓకే అయ్యాక ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది నిర్ణయించనున్నారు. సమ్మర్ తర్వాత వెనక్తేష్ నెక్స్ట్ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు