‘లవర్స్’ కి హైలైట్ కానున్న సెకండాఫ్

‘లవర్స్’ కి హైలైట్ కానున్న సెకండాఫ్

Published on Aug 13, 2014 12:20 PM IST

Lovers
‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా హిట్ అందుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా, ‘ప్రేమ కథాచిత్రమ్’ తో అందరినీ ఆకట్టుకున్న నందిత హీరోయిన్ గా రూపొందిన సినిమా ‘లవర్స్’. ఈ సినిమా ఆగష్టు15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న సినిమాలను నిర్మించి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి హరినాథ్ డైరెక్టర్.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం లవర్స్ సినిమాకి సెకండాఫ్ మేజర్ హైలైట్ కానుంది. ముఖ్యంగా సప్తగిరి ఎంటర్టైన్మెంట్, మారుతి డైలాగ్స్ హైలైట్ కానున్నాయి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండాఫ్ బాగుంటే సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది అంటారు. దాంతో ఈ చిత్ర టీం కూడా సెకండాఫ్ లవర్స్ కి హైలైట్ కాబట్టి మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నైజాంలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.

తాజా వార్తలు