ప్రభాస్ రెండో షెడ్యూల్ ని కూడా.. !

ప్రభాస్ రెండో షెడ్యూల్ ని కూడా.. !

Published on Apr 1, 2019 5:15 PM IST

Prabhas

మొత్తానికి ప్రభాస్ గ్యాప్ కూడా తీసుకోకుండా ‘సాహో’తో పాటు, ఇటు రాధాకృష్ణ సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ ఈ సారి ప్రభాస్ హీరోగా ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో సుమారు 16 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఈ రోజుతో అక్కడ షెడ్యూల్ ను ముగించింది. కాగా ఈ షూట్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే అలాగే ఇతర కీలక నటీనటులు కూడా పాల్గొన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పక్కా ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం 1960 కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు