రెండవ టీజర్ తో సిద్దమవుతున్న నాగార్జున !

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘ఆఫీసర్’. మొదటి నుండి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన యాక్షన్ టీజర్ కు మంచి స్పందన దక్కగా ఇప్పుడు రెండు టీజర్ ను సిద్ధం చేశారు చిత్ర యూనిట్.

ఈ టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదలచేయనున్నారు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా నటిస్తుండగా చిత్రాన్ని మే 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో విజయాన్ని అందుకుని మరోసారి తానేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు వర్మ.

Exit mobile version