మహేష్ మేకోవర్ వెనకున్న అసలు రహస్యం !

మహేష్ మేకోవర్ వెనకున్న అసలు రహస్యం !

Published on Jun 12, 2018 5:58 PM IST

mahesh2

సూపర్ స్టార్ మహేష్ బాబు మామూలుగా హాలీడేట్రిప్ కు వెళ్లి వస్తూ వస్తూ కొత్త మేకోవర్ తో వచ్చారు. ఈ మేకోవర్ ఆయన చేయబోయే 25వ సినిమా కోసమే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. అయితే మహేష్ పారిస్ నుండి వస్తూ వస్తూ నేరుగా హైదరాబాద్ రాకుండా మధ్యలో ముంబై కు వెళ్లారు.

ముంబై మీడియా వర్గాల సమాచారం మేరకు తన సిల్వర్ జూబ్లీ సినిమా కోసం చేసుకుంటున్న మేకోవర్ కోసం ఆయన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలీమ్ ను కలిశారని, ఆయనే మహేష్ యొక్క ట్రెండీ హెయిర్ స్టైల్ కు కారణమని చెబుతున్నారు. ఇకపోతే పైడిపల్లి సినిమాలో కొంత భాగం మహేష్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించనుంది.

తాజా వార్తలు