‘సీక్రెట్ సోల్జర్’ ట్రైలర్ విడుదల.. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్

‘సీక్రెట్ సోల్జర్’ ట్రైలర్ విడుదల.. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్

Published on Aug 29, 2026 9:00 PM IST

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై డ్రామా చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’ ట్రైలర్ విడుదలైంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు శైలేష్ కొలను, రచయిత-దర్శకుడు బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

​కంటెంట్ బలంగా ఉన్నప్పుడు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని శైలేష్ కొలను పేర్కొన్నారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, నటీనటులు నిహాల్, సూర్య శ్రీనివాస్ తమ పాత్రల కోసం పడిన కష్టం కనిపిస్తోందని ఆయన అభినందించారు. బీవీఎస్ రవి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేసిన సాంకేతిక బృందాన్ని ప్రశంసిస్తూ, చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

​యాక్షన్, హ్యూమర్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయని హీరోలు నిహాల్, సూర్య శ్రీనివాస్ తెలిపారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించామని దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి వివరించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, హర్షిత బండ్కమూరి, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు