ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు అర్జున్ ‘సీతా పయనం’

Seeyha Payanam

యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో, శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం.

నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడిగా బాధ్యతలు చేపట్టిన అర్జున్ కూడా ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, ఆయన మేనల్లుడు ‘యాక్షన్ ప్రిన్స్’ ధ్రువ సర్జా గెస్ట్ రోల్‌లో సందడి చేయనున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు, జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కిక్ యాస్ కాళీ స్టంట్స్ సమకూర్చారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నెలకొంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.

Exit mobile version