సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. మళ్ళీ హిట్టు..

seethamma vaakitlo sirimall

మన తెలుగు సినిమా దగ్గర వచ్చిన కొన్ని బ్యూటిఫుల్ మల్టీస్టారర్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా సమంత (Samantha), అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన అందమైన కుటుంబ కథా చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” (Seethamma Vaakitlo Sirimalle Chettu ReRelease) కూడా ఒకటి. మరి దశాబ్దం కితమే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత థియేటర్స్ లో రీరిలీజ్ కి వచ్చింది.

అయితే ఈ సినిమా అప్పుడు హిట్ అయ్యి తనకి మంచి లాభాలు కూడా అందించింది అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక మళ్ళీ కొత్త సినిమా తరహా లోనే మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కూడా హిట్టు గానే నిలిచింది అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఆడియెన్స్ అదిరే రెస్పాన్స్ ని అందిస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా సీన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తానికి మళ్ళీ ఈ మల్టీస్టారర్ మంచి హిట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు.

Exit mobile version