త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గోపీచంద్ “సీటీమార్”

Published on Jan 28, 2022 5:06 pm IST

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సీటీమార్. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మించడం జరిగింది. ఈ సినిమా థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించగా, దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :