మళ్లీ ఎలాంటి సెన్సేషనల్ హిట్ ఇస్తాడో !

Published on Jun 27, 2019 11:30 pm IST

బలమైన కథలతో సెన్సిబుల్ గా సినిమాలు తీయడంలో శేఖర్ కమ్ములకి మంచి పట్టు ఉంది. పైగా ఫిదా తర్వాత నాగచైతన్య – సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా పెట్టి మొత్తానికి క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్యకి ఈ సినిమా కీలకం కానుంది. చైతు ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటే.. మార్కెట్ పరంగా చైతు స్థాయి ఖచ్చితంగా పెరుగుతుంది.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ బల్క్ డేట్స్ కేటాయించారు. మరి శేఖర్ కమ్ముల మళ్లీ ఎలాంటి సెన్సేషనల్ హిట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More