సాలిడ్ అప్డేట్ ఇవ్వ‌నున్న ‘కుబేర’

సాలిడ్ అప్డేట్ ఇవ్వ‌నున్న ‘కుబేర’

Published on Jul 2, 2024 2:00 PM IST

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ ఇప్పటికే శ‌ర‌వేగంగా షూటంగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున‌, త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ క‌లిసి న‌టిస్తుండటంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఈ అంచనాల‌ను మ‌రింత పెంచేశాయి.

అయితే, ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా వెల్ల‌డించారు. ఇవాళ సాయంత్రం 5.04 గంట‌ల‌కు ఓ ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ న్యూస్ ఏమై ఉంటుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను శేఖ‌ర్ క‌మ్ముల అత్యంత ప్రెస్టీజియ‌స్ గా తెర‌కెక్కిస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, అమిగోస్ క్రియేష‌న్స్ ప్రై.లిమిటెడ్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహ‌న్ రావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు