సైలెంట్గా మూవీ కంప్లీట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్

Published on May 21, 2019 11:00 pm IST

ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ మూవీస్ ని తెరకెక్కించే దర్శకునిగా పేరు పొందారు శేఖర కమ్ముల. తన మొదటి సినిమా “ఆనంద్” తోనే ఆయన మంచి కాఫీ తగిన అనుభూతి కలిగే మూవీ ని తీశారు. ఆ తదుపరి ఆయన తీసిన “హ్యాపీడేస్” అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని కోణంలో కాలేజీ లైఫ్ ని చూపించారు. లేటెస్ట్ గా “ఫిదా” తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ ఎటువంటి హడావుడి లేకుండా తదుపరి మూవీని పూర్తి చేస్తున్నాడట.

అందరు కొత్త నటులతో తెరకెక్కనున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కొరకు త్వరలో దుబాయ్ వెళ్లనున్నారంట. ఒక పెద్ద హిట్టు పడ్డ దర్శకుని నెక్స్ట్ మూవీ అంటే ఇండస్ట్రీలో బజ్ మాములుగా ఉండదు. అలాంటిది “ఫిదా” లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల మూవీ ఇంత సైలెంట్ గా చిత్రీకరణ జరగడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది.

సంబంధిత సమాచారం :

More