మెగా డేట్ కు కమ్ముల “లవ్ స్టోరీ”..?

Published on Apr 16, 2021 3:01 pm IST

చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు సినిమా థియేటర్స్ లో కళకళలాడింది అనుకునే సంతోషం కనీసం ఆరు నెలల వరకు కూడా ఉండేలా కనిపించలేదు. ఆరంభమే “క్రాక్”తో అదరగా తర్వాత ఒక్కో నెలలో ఒక్కో భారీ హిట్ తో తెలుగు బాక్సాఫీస్ దద్దరిల్లింది. మరి ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా కరోనా పెరుగుతుండడం మళ్ళీ ప్రతీ ఒక్కరినీ కలవరపెడుతుంది. ఇప్పటికే ఈ ఏప్రిల్ లో సినిమాలు వాయిదా పడటం స్టార్ట్ అయ్యాయి.

మొన్న పవన్ వకీల్ సాబ్ అనంతరం ఈరోజు ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన నాగచైతన్య మరియు సాయి పల్లవిల తో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మోస్ట్ అవియేటెడ్ చిత్రం “లవ్ స్టోరీ” విడుదల కావాల్సి ఉంది కానీ దానిని వాయిదా వేశారు. అప్పుడు ప్రకటిస్తూనే వారు మలి విడుదల తేదీ ఎప్పుడో అన్నది త్వరలోనే తెలుపుతాము అని అన్నారు. మరి ఇప్పుడు సినీ వర్గాల నుంచి చిత్ర యూనిట్ ఓ డేట్ ను అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

అది మే 13 అన్నట్టు టాక్.. అయితే మరి సరిగ్గా ఇదే డేట్ కి మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న “ఆచార్య” కూడా ఉంది. అయితే ఈ సినిమా ఇంకా వాయిదా పడిందో లేదో క్లారిటీ లేదు కానీ లవ్ స్టోరీ మేకర్స్ మాత్రం అప్పటికి కరోనా ప్రభావం తగ్గొచ్చు అని ఊహించి అప్పటికే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :