ఖాయమైన శేఖర్ కమ్ముల బాలీవుడ్ ఎంట్రీ

sekhar-kammula
ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల బాలీవుడ్ లో ప్రవేశించడానికి అంతా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని అంగీకరించారు. హ్యాపీ డేస్ చిత్రాన్ని హిందీ లో రిమేక్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే సల్మాన్ ఖాన్ తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రిమేక్ చేస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు కావాలసిన నటుల ఎంపికలో ప్రస్తుతం ఈ చిత్ర బృందం నిమగ్నమై ఉంది.

హిందీ లో శేఖర్ కమ్ముల ఓ చిత్రం చేస్తున్నారని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అవి ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ‘ప్రతీసారి హ్యాపీ డేస్ ను హిందీ లో చెయ్యాలని అనుకొంటున్నాను. అయితే తెలుగు లో కొన్ని చిత్రాల వల్ల కొద్దిగా అది ఆలస్యమైంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు కొంత బ్రేక్ ఇచ్చి, హిందీ చిత్రాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. సల్మాన్ ఖాన్ తో కలిసి చిత్రాన్ని నిర్మించడం నాకెంతో సంతోషంగా ఉంది. అతనితో కలిసి నా భావాలను పంచుకొంటా’ నని శేఖర్ కమ్ముల తెలిపారు.

నయనతార ప్రధాన పాత్రధారిగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘అనామిక’ మే 1 న విడుదలకు సిద్దమైంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version