‘7/జి బృందావన కాలనీ’, ‘యుగానికి ఒక్కడు’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు సెల్వ రాఘవన్. అతను దర్శకత్వం వహించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే’ సినిమా ఘన విజయం సాదించింది. డిఫరెంట్ ఫిలిం మేకర్ గా పేరు సొంతం చేసుకున్న సెల్వ రాఘవన్ గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. ఈ పరిస్థితికి కారణం ‘వర్ణ’ సినిమా.
ఆర్య, అనుష్క జంటగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో భారి వ్యయంతో రూపొందిన ‘వర్ణ’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వర్ణ విడుదల తర్వాత సెల్వ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఇక సెల్వ పనైపోయింది అంటూ విమర్శలు వచ్చాయి. వీటిపై ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు సెల్వ.
‘కేవలం డబ్బు కోసమో… మరో అంశం కోసమో నేను సినిమాలు తీయలేను. స్టొరీ లైన్, స్క్రిప్ట్ నాకు బాగా నచ్చాలి. ప్రస్తుతం నేనొక కథ రాస్తున్నాను. త్వరలో సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తాను. థాంక్స్ ఫర్ సపోర్ట్ & లవ్’ అని సెల్వ రాఘవన్ ట్వీట్ చేశారు.



