ఇంటర్వ్యూ : బ్రహ్మాజీ – తెలుగులో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు !

Published on Mar 4, 2020 1:34 pm IST

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

 

ఎందుకు మీ అబ్బాయిని హీరోగా తీసుకురాలనుకున్నారు ?

అందరూ వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో వాళ్ళబ్బాయిలను ఎందుకు పైకి తీసుకురావాలనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను.

 

ఈ సినిమా కోసం మీకున్న పరిచయాలను అన్నిటినీ వాడినట్టు ఉన్నారు ?

లేదు సగమే వాడాను. మొత్తం ఒక్క సినిమాకే వాడితే ఎట్టా. మిగతా సగం రెండో సినిమా కోసం వాడతాను.

 

‘ఓ పిట్టకథ’లో మీ పాత్ర గురించి ?

అమలాపురంలోని ఉండే ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను. నా క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది. ఒక అమ్మాయి మిస్ అయింది, ఎలా మిస్ అయింది ? అనే కోణంలో సాగుతుంది నా క్యారెక్టర్.

 

మీ అబ్బాయి సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు. మీరెలాంటి సపోర్ట్ ఇచ్చారు ?

ట్రై చెయ్యమన్నాను. వర్కౌట్ అయితే ఉండు.. లేకపోతే నీకు నచ్చింది చేసుకో అని చెప్పాను. ఇక సపోర్ట్ అంటే ఒక ఫాదర్ గా ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేశాను. అయితే ఇంత చేస్తూ… తనని సోలో హీరోగా పరిచయం చెయ్యొచ్చు. కానీ, ఒక మంచి క్యారెక్టర్ లోనే సంజయ్ తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ఈ సినిమా చేయడం జరిగింది.

 

మీరు ఇంత యంగ్ లా ఎలా కనిపిస్తున్నారు ?

మీరే చెప్పాలి. ఎలాంటి కొత్త విషయాలు ఏమి లేవు. జీన్స్ ప్రభావం.

 

ఇండస్ట్రీలో అందరీ హీరోలతోటి మంచి రిలేషన్స్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నారు ?

అందరూ మంచోళ్ళే అండి. మీకు తెలియని విషయం ఏమిటంటే.. ఇండస్ట్రీలో హీరోలందరూ ఫ్రెండ్స్. కలిసి పార్టీలు చేసుకుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటారు. బయటవ్యక్తులే రకరకాలు అనుకుంటుంటారు.

 

ఈ సినిమా గురించి బాగా నమ్మకంగా ఉన్నట్టు ఉన్నారు ?

ఈ సినిమాలో మంచి స్క్రీన్ ప్లే ఉంది అండి. రెగ్యూలర్ లా అనిపించదు. చాలా ఇంట్రస్టింగ్ ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకు ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. సినిమాలో చాల యాంగిల్స్ లో స్క్రీన్ ప్లే నడుస్తోంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.

 

మీరు సెట్స్ లో తోటి ఆర్టిస్ట్ లకు హెల్త్ టిప్స్ చెబుతుంటారు అంట కదా ?

హెల్త్ టిప్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉంటాయి అండి. రోజూ పొద్దునే లేచి వ్యాయామం చేయండి. మంచి డైట్ ఫాలో కాండి. నెగిటివ్ యాంగిల్ కి పూర్తి దూరంగా ఉండండి. ఇంతకు మించి హెల్త్ టాప్స్ ఏమి ఉంటాయి.

 

ఇండస్ట్రీలో ఈ సినిమాని ఇప్పటివరకూ ఎవరెవరు చూశారు. వాళ్ళ ఎలా రియాక్ట్ అయ్యారు ?

నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ చూశారండి. కృషవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హనురాఘవ్ పూడి ఇలా కొంతమంది చూశారు. వాళ్ళందరికీ సినిమా బాగా నచ్చింది.

సంబంధిత సమాచారం :

X
More