మా ఎన్నికలు: ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు…తన మద్దతు ఎవరికంటే?

Published on Oct 8, 2021 6:27 pm IST

మా ఎన్నికల్లో ఊహించని రీతిలో అధ్యక్ష పదవి కోసం పోటీ జరుగుతుంది. ఒక పక్క మంచు విష్ణు, మరొక పక్క ప్రకాష్ రాజ్ లు ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు. అయితే మా సభ్యుల కోసం ఇప్పటికే మంచు విష్ణు మేనిఫెస్టో ను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు పై, నటుడు ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

మంచు విష్ణు కి అర్హత ఉందని, అందుకే నిల్చున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రకాష్ రాజ్ అంటూ అతని పై కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు గా ఆయన గురించి ఏమీ మాట్లాడను అని అన్నారు. అయితే అతనితో ఒక 15 సినిమాలు మెయిన్ క్యారెక్టర్స్ చేసినట్లు తెలిపారు. ఏ సినిమాకి కూడా ఒక్క రోజు టైం కి రాలేదు అని అన్నారు. ఈ విషయం లో మనం కొంచెం ఆలోచించు కోవాలి అంటూ సభ్యులను ఉద్దేశించి కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఇక్కడకి రాని వారందరికీ కూడా చెప్పి, ఓటు మంచు విష్ణు గారు నిలుచుంటున్నారు, గెలిపించాలని ప్రార్థించారు.

సంబంధిత సమాచారం :