ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం !

ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం !

Published on Jul 28, 2018 4:10 PM IST

Annapurana

తెలుగు తెర పై తల్లి పాత్రల్లో అమ్మమ్మ పాత్రల్లో ఒదిగిపోయిన సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అన్నపూర్ణ కుమార్తె కీర్తి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యల కారణంగానే కీర్తి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.

కీర్తి డెడ్ బాడీ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. పరీక్షల్లో కీర్తిది ఆత్మహత్య అని నిర్ధారణ అయితే కీర్తి డెడ్ బాడీని అన్నపూర్ణకు అప్పగించనున్నారు. అనుకోకుండా జరిగిన ఈ దురదృష్ట సంఘటనకు అన్నపూర్ణ కుటుంబం మొత్తం తీవ్ర విషాదాంలో మునిపోయింది.

తాజా వార్తలు