విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో సీనియర్ హీరోలు ?

Published on Mar 20, 2019 8:01 pm IST

తమిళ స్టార్ హీరోలు మాధవన్ , విజయ్ సేతుపతి కలిసి నటించిన కోలీవుడ్ చిత్రం విక్రమ్ వేద. 2017లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయ్యి ఐఎండిబి లో అత్యధిక రేటింగ్స్ ను సాధించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పుష్కర్ , గాయత్రి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ హీరోలు బాలకృష్ణ , రాజశేఖర్ లను ఈ సినిమా కోసం సంప్రదిస్తునట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. ఇక రాజశేఖర్ ప్రస్తుతం కల్కి లో నటిస్తుండగా బాలకృష్ణ ఎలక్షన్స్ లో బిజీగా వున్నారు.

సంబంధిత సమాచారం :

More