మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు, ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి సిస్టర్ రోల్ ఉందని.. ఈ పాత్ర చాలా ఎంటర్టైనింగ్ టోన్ లో సాగుతుందని.. ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించబోతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.
కాగా ప్రస్తుతం వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో చిరంజీవి పాత్రకి ప్రత్యేకమైన యాస మరియు బాడీ లాంగ్వేజ్‌ను అనిల్ రావిపూడి డిజైన్ చేస్తున్నారట. అదేవిధంగా సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు.
అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.