విలన్ పాత్రతో మేపించబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

విలన్ పాత్రతో మేపించబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

Published on Aug 7, 2018 8:29 PM IST

madhu bala
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల తెలుగులో ఆ మధ్య వచ్చిన ‘సూర్య వెర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె తమిళ నటుడు బాబీ సింహ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘అగ్ని దేవ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మధుబాల భిన్నమైన విలన్ పాత్ర చేసిందట.

అయితే కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం నెగిటివ్ పాత్రలో మొదటిసారిగా నటిస్తోన్న మధుబాల తన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారట. ముఖ్యంగా ఆమె పలికించిన హవాభావాలు ఆమె పలికిన డైలాగ్ లు పూర్తిగా కొత్తగా ఉంటాయట. ఈ చిత్రం విడుదలయ్యాక ఆమెకు మరిన్నీ విలన్ పాత్రలు వస్తాయని చిత్రబృందం చెబుతుంది. జై ఫిల్మ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ పాల్ రాజ్, శామ్ సూర్యలు డైరెక్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు