నితిన్ – యేలేటి సినిమాలో సీనియర్ హీరోయిన్ ?

Published on Apr 17, 2019 5:47 pm IST

ఇటీవల వరుసగా మూడు సినిమాలను ప్రకటించి ఫ్యాన్స్ ను హ్యాపీ చేశాడు యంగ్ హీరో నితిన్. అందులో భాగంగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తో భీష్మ అనే చిత్రం చేయనుండగా సాహసం ఫేమ్ చంద్ర శేఖర్ యేలేటి తో ఒకసినిమాని అలాగే చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య తో కూడా ఓ సినిమా చేయనున్నాడు నితిన్.

ఇక మూడు సినిమాల్లో యేలేటి తో చేయనున్న సినిమా ఫస్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్. ఒకవేళా ఈవార్తలు నిజమైతే నితిన్ – రకుల్ ప్రీత్ మొదటిసారి కలిసి నటించనున్నారు. కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :