ఆస్పత్రిలో సీనియర్‌ హీరో.. తీవ్ర అస్వస్థత !

Published on Mar 22, 2021 2:30 pm IST

సీనియర్‌ హీరో కార్తీక్‌ అస్వస్థతకు లోనవ్వడంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మనిద ఉరిమై కట్చి వ్యవస్థాపకుడిగా ఉన్న కార్తీక్‌ తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా.. ఆయన అస్వస్థతకు లోనైయినట్టు తెలుస్తోంది. శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చెన్నై అడయార్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

కాగా తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్‌ సుపరిచితుడే. ఈయన వారసుడు సైతం ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చారు. తాజాగా అప్పుడప్పుడు తెరపై కనిపించే కార్తీక్, ప్రస్తుతం రాజకీయ ప్రచారానికి సిద్ధమయ్యారు. కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :