ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ అండ్ భారీ గ్రాసర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సినిమా ధురంధర్ 2 అనే చెప్పాలి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామా థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ గా నిలిచి ఇప్పుడు ఎట్టకేలకి ఓటిటిలో విడుదలకి వచ్చింది.
ఈ మొదటి పార్ట్ ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తే పార్ట్ 2 ని మాత్రం జియో హాట్ స్టార్ వారు ఈ జూన్ 4 సాయంత్రం 7 గంటల సమయం నుంచి అందుబాటులోకి తెచ్చేసారు. ఇది మాత్రం ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. అలానే అప్పుడు థియేటర్స్ లో మిస్ అయ్యిన వారికీ కూడా ఇదో గోల్డెన్ ఛాన్స్. సో ధురంధర్ 2 సినిమా చూడాలి అనుకుంటే ఇండియాలో హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒక్క హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇక ఓవర్సీస్ ఆడియెన్స్ కి సినిమా ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.


