మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా గ్రాండ్ గా విడుదల అవుతున్న సమయంలో మేకర్స్ అవైటెడ్ స్పెషల్ సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. శృతి హాసన్ అలానే జాన్వీ కపూర్ లతో దుమ్ము లేపిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ కి ఇపుడు భారీ రెస్పాన్స్ నమోదు అవుతుంది.
ఒక్క తెలుగు వెర్షన్ లోనే కేవలం 11 గంటల్లో ఏకంగా 18 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టి క్రేజీ రెస్పాన్స్ ని నమోదు చేసింది. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఈ చార్ట్ బస్టర్ సాంగ్ నుంచి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మేకర్స్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఆ సాంగ్ షూట్ లో శివరాజ్ కుమార్, బుచ్చిబాబు, చరణ్, జాన్వీ, శృతి హాసన్ అలాగే రత్నవేలు లతో కలిసి ఉన్న ఫోటోలు మేకర్స్ షేర్ చేశారు.
దీనితో ఈ స్పెషల్ సాంగ్ మరింత వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 4న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.
