సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు చేస్తున్న “సలార్”

సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు చేస్తున్న “సలార్”

Published on Aug 23, 2023 12:00 PM IST

Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ అండ్ పాన్ ఇండియా లెవెల్లో వేరే లెవెల్ హైప్ తో ఉన్న చిత్రం రీసెంట్ గానే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర బుకింగ్స్ ని ఓపెన్ చేసుకుంది.

మరి ఇలా బుకింగ్స్ స్టార్ట్ తోనే క్రేజీ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా ఇంకా 36 రోజులు సమయం ఉన్నప్పటికి అప్పుడే లక్ష 30 వేల డాలర్స్ మార్క్ ని అయితే టచ్ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో సలార్ కి యూఎస్ లో క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే రిలీజ్ నాటికి అయితే సలార్ 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని జస్ట్ ప్రీమియర్స్ తోనే టచ్ చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరగనుందో చూడాలి.

తాజా వార్తలు