ఫ్రాన్స్‌ లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న సెన్సేష‌న‌ల్ స్టార్ !

ఫ్రాన్స్‌ లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న సెన్సేష‌న‌ల్ స్టార్ !

Published on Jun 4, 2019 2:46 AM IST

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు.

ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు