సెన్సార్ లో `నేనే కేడీ నెం-1’ !

సెన్సార్ లో `నేనే కేడీ నెం-1’ !

Published on Jun 8, 2019 2:00 AM IST

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం `నేనే కేడీ నెం`1’. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుపుకుంటోంది. జూన్ చివ‌రి వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

కాగా ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా అనే పాయింట్ తో రాబోతున్న ఈ సినిమాలో నేటి బిజీ లైఫ్ ను అలాగే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి వ‌దిలేస్తున్నారు ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించనున్నారు. అలాగే ముకుల్ దేవ్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయట. ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః శ్రావ‌ణ్ కుమార్; ఎడిట‌ర్ః స‌ములేటి శ్రీనివాస్ ; స్టోరీ – స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాతః జాని.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు