సెన్సార్ పూర్తి చేసుకున్నహవీష్ మూవీ “సెవెన్”

Published on Jun 3, 2019 11:34 am IST

యువ కథానాయకుడు హవీష్ నటించిన చిత్రం ‘సెవెన్‌’. నిజార్ షఫీ దర్శకుడు. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 6న విడుదల కాబోతోంది.

నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ కి యు/ఏ సెటిఫికేట్ పొందింది. ఈ చిత్రం సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉందని సమాచారం.సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. మూవీ నిర్మాత రమేష్ వర్మ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజిక్ చైతన్య భరద్వాజ్ సమకూర్చారు.

సంబంధిత సమాచారం :

More