ప్రభాస్ కు ఇన్స్టా లో సెపరేట్ క్రేజ్ అట.!

Published on Nov 22, 2020 1:02 pm IST

మన తెలుగు హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. ముఖ్యంగా యూత్ లో డార్లింగ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య యువత కూడా ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అలాంటి వాటిలో ఇన్స్టాగ్రామ్ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఇప్పుడు ఇందులనే ప్రభాస్ కు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అలా ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన వెంటనే భారీ ఫాలోవర్స్ వచ్చేసారు. అలాగే ప్రభాస్ నుంచి ఓ పోస్ట్ పడితే 1 మిలియన్ లైక్స్ పడిపోవాల్సిందే. అలా ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యామ్” ట్యాగ్ ను డార్లింగ్స్ అందులో టాప్ లో పెట్టారట.

మూడు లక్షలకు పైగా ట్యాగ్స్ తో రాధే శ్యామ్ సినిమానే టాప్ లో ఉందట. ఇది కూడా మరే ఇతర హీరో సినిమాకు కూడా లేని విధంగా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనితో ఇన్స్టాలో మాత్రం ప్రభాస్ కు కాస్త సెపరేట్ క్రేజ్ ఉందనే చెప్పాలి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More