Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : సెవెన్‌ – కథాంశం బాగున్నా, కథకథనాలు ఆకట్టుకోవు !

Seven movie review

విడుదల తేదీ : జూన్ 06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రహ్మాన్., హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి తదితరులు

దర్శకత్వం : నిజార్ షఫీ

నిర్మాత : రమేష్ వర్మ

సంగీతం : చైతన్ భరద్వాజ్

స్క్రీన్ ప్లే : రమేష్ వర్మ

సినిమాటోగ్రఫర్ : నిజార్ షఫీ

ఎడిటర్ : ప్రవీణ్ కెఎల్

ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా మన ముందుకు వస్తున్న చిత్రం సెవెన్(7). రహ్మాన్, హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి వంటి తారాగణం నటించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

కార్తీక్ (హవిష్ ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ.. యూఎస్ వెళ్లాలని గోల్ పెట్టుకుంటాడు. అయితే రమ్య (నందితా శ్వేతా), జెన్నీ (ఆనిశా), అదితి ఆర్యా ఇలా ముగ్గురు అమ్మాయిల ఒకరు తరువాత ఒకరు తమ భర్త కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లేయింట్ చేస్తారు.ఆ తరువత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఆ అమ్మాయిల అందరూ చెప్పిన భర్త కార్తీక్ (హవిష్ ) ఒకరే అని తేలుతుంది. కార్తీక్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారని, పోలీస్ లు అతన్ని వెతికి పట్టుకుంటారు. కానీ అంతలో అచ్చం కార్తీక్ లాగే కృష్ణమూర్తి అనే మరో వ్యక్తి ఉండేవాడని తేలుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిలను మోసం చేసింది కార్తీకేనా ? లేక కృష్ణమూర్తినా ? అసలు కృష్ణమూర్తి ఎవరు ? అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రేమ కథలు ఒకేలా ఎందుకు ఉన్నాయి ? మొత్తానికి కార్తీక్ జీవితంలో ఏమి జరిగి ఉంటుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో స్టోరీ పాయింట్ చాలా బాగుంది. పైగా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని మలచాలని దర్శకనిర్మాతలు మంచి ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఫిర్యాదులకు తగ్గట్లుగా ఇన్వెస్ట్ గేషన్ చేసే సీన్లు ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతాయి. అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అలాగే రెజీనా పాత్రకు సంబంధించిన సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక నటీనటుల నటన విషయానికి వస్తే హీరోగా నటించిన హవిష్ చాల బాగా నటించాడు. రెండు గెటప్స్ లో కొత్తదనం చూపిస్తూ చక్కని నటనను కనబర్చాడు. ఇక ఏ పాత్ర అయినా అందుకు తగ్గట్టుగానే నటించే రెజీనా.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అద్భుత నటన కనబర్చింది. అలాగే కీ రోల్ లో కనిపించిన నందితా శ్వేతా మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. మిగిలిన హీరోయిన్స్ కూడా మంచి నటన కనబర్చారు.అలాగే రహ్మాన్ తదితరులు వారి పాత్రలకు తగ్గ న్యాయం చేకూర్చారు. ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

అయితే దర్శకరచయితలు థీమ్, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ కథనం విషయంలో మాత్రం విఫలం అయ్యారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్ కాదు.

పైగా సినిమాలో ప్రధానమైన కథనం, మెయిన్ లవ్ స్టోరీ బోర్ కొట్టడం, సెకెండ్ హాఫ్ స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం, అలాగే ఓల్డ్ గెటప్ లో నటించిన నటి ఆ పాత్రకు సరిగ్గా సూట్ కాకపోవడం వంటి అంశాలు సినిమాకి పెద్ద మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

నిజార్ షఫీ దర్శకుడిగా కెమెరామెన్ గా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే మంచి కథ, ఆసక్తికరమైన కథనాన్ని తీసుకోవడంలో మాత్రం ఆయన విఫలం అయ్యారు.

సంగీత దర్శకుడు చైతన్య భరద్వాజ్ అందించిన నేపధ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాత రమేష్ వర్మ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

హవిష్, రెజీనా – నందితా శ్వేతా హీరో హీరోయిన్స్ గా ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ డ్రామా ఆకట్టుకోలేకపోయింది. అయితే రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని మలచాలని దర్శకనిర్మాతలు బాగానే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కథాంశం, కథానుసారం వచ్చే ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లోని కొన్ని అంశాలు ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అయితే సెకెండ్ హాఫ్ స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం, ఓల్డ్ గెటప్ పాత్ర కొంత ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తానికి ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పర్వాలేదనిపిస్తోంది. అయితే ఈ చిత్రం మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :