ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ : అదరగొట్టిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సేల్స్

ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ : అదరగొట్టిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సేల్స్

Published on Sep 28, 2015 10:43 AM IST

Subramanyam-for-Sale
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనే టాక్ ని సొంతం చేసుకుంది. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సూపర్ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. మొదటి షో నుంచే ఫుల్ పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఫస్ట్ వీకెండ్ సూపర్బ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఆంధ్ర, తెలంగాణాలో సక్సెస్ఫుల్ టూర్ ని నిర్వహిస్తున్నారు.

ఫస్ట్ వీకెండ్ మేము తెలుసుకున్న బాక్స్ ఆఫీసు రిపోర్ట్స్ ప్రకారం మొదటి రోజుతో పోల్చుకుంటే మిగతా మూడు రోజులు కలెక్షన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆంధ్ర, తెలంగాణాలో కలుపుకొని సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ఫస్ట్ వీకెండ్ 10 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. సాయిధరమ్ తేజ్ మూడవ సినిమాతోనే బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకోవ్డంతో ఈ చిత్ర తెమ చాలా చాలా హ్యాపీగా ఉంది. కథ పాతదే అయినా హరీష్ శంకర్ మార్క్ కామెడీ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర జంటగా నటించిన ఈ సినిమాకి వీరిద్దరి కెమిస్ట్రీనే స్పెషల్ హైలైట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు