ఇండియన్ 2 కంటే ముందే రానున్న శభాష్ నాయుడు !

ఇండియన్ 2 కంటే ముందే రానున్న శభాష్ నాయుడు !

Published on Jun 19, 2018 1:13 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇది గాక అయన చేతిలో 3 సినిమాలు కూడా వున్నాయి . బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిన సినిమాల్ని పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో పడ్డారు అయన . దాంట్లో భాగంగానే ‘విశ్వరూపం 2’ సినిమా ని ఆగష్టు 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ని కూడా విడుదలచేశారు, దీని తరువాత శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాని మొదలు పెడతారని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా కన్నా ముందు ‘శభాష్ నాయుడు’ చిత్రాన్ని పూర్తి చేస్తారట కమల్. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు .

నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ చిత్ర షూటింగ్ బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాని ఆయనే నిర్మిస్తుడడం విశేషం. తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ కూతురు శృతి హాసన్ అలాగే రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం ఈ సినిమాలో అప్పారావు పాత్రలో కనిపించనున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు