రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో షఫీ ఒక క్రైమ్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో షఫీని హర్రర్ సినిమాలు తీసే దర్శకుడిగా, ఆ సినిమాలు తీస్తూ ఎదురయ్యే పరిణామాలను చూపించనున్నారు
ఈ సినిమా గురించి షఫీ మాట్లాడుతూ “దర్శకుడు కధ చెప్పగానే సినిమాలో కంటెంట్ వుందనిపించింది. కనేంట్ వున్న ప్రతీ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. మిగిలిన అంశాలు విజయానికి దోహద పడతాయి” అని తెలిపాడు. జోయా ఖాన్ హీరొయిన్. షఫీ ఈ సినిమాలో పలు విభిన్న పార్శ్వాలున్న పాత్రను పోషించనున్నాడు.


