రజినీకాంత్‌కు షారూక్ ఖాన్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్ట్ ఏంటో తెలుసా !

రజినీకాంత్‌కు షారూక్ ఖాన్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్ట్ ఏంటో తెలుసా !

Published on Sep 30, 2020 11:01 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రేక్షకుల్లోనే కాదు హీరోల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. దక్షిణాదిన విజయ్, అజిత్ మొదలు యువ హీరోలంతా రజనీకాంత్ అభిమానులే. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సైతం రజినీకాంత్‌కు పెద్ద ఫ్యాన్. పలు సందర్భాల్లో దక్షిణాది హీరోల్లో మీకు ఎవరు ఇష్టం అంటే రజినీకాంత్, కమల్ హాసన్ పేర్లు చెప్పేవారు షారుక్. తన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో ఏకంగా రజినీ స్టైల్ మీద లుంగి డ్యాన్స్ పాటను కూడ పెట్టారు. రజినీకి కూడా షారుక్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది.

అందుకే షారుక్ 2011లో తాను చేసిన ‘రా.వన్’ సినిమాలో రజినీకాంత్‌ను ఒక చిన్న పాత్రలో నటించమని అడగడం, రజినీ వెంటనే ఒప్పుకుని చేయడం జరిగాయి. తానూ అడగ్గానే ఒప్పుకుని సినిమాలో నటించినందుకు అప్పట్లో షారుక్ ఖాన్ రజినీకి ప్రేమతో ఖరీదైన బీఎండబ్ల్యు 7 సిరీస్ కారును బహుమతిగా ఇచ్చారట. రజినీకి మాత్రమే కాదు అందులో ప్రతినాయకుడి పాత్ర పోషించిన అర్జున్ రాంపాల్, ఆ చిత్ర దర్శకుడు అనుభవ్ సిన్హాలకు కూడ కార్లను బహుమతిగా ఇచ్చారట షారుఖ్. అప్పట్లో బయటకు రాని ఈ విషయం తాజాగా జాతీయ మీడియాలో రివీల్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు