సెన్సార్ పూర్తి చేసుకున్న షారుక్ ఖాన్ ‘జవాన్’

సెన్సార్ పూర్తి చేసుకున్న షారుక్ ఖాన్ ‘జవాన్’

Published on Aug 22, 2023 8:14 PM IST

Jawan
బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఇటీవల సిద్దార్ధ ఆనంద్ తెరకెక్కించిన భారీ మూవీ పఠాన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తన భార్య గౌరి ఖాన్ తో కలిసి గౌరవ్ వర్మ నిర్మిస్తున్న జవాన్ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన జవాన్ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా మూవీని సెప్టెంబర్ 7న గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా జవాన్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ మూవీకి సిబిఎఫ్ సి వారు యు/ఏ సర్టిఫికెట్ ని కేటాయించారు. అలానే ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. 49 ని. లుగా ఉంది. ఒకరకంగా ఇది లెంగ్తీ రన్ టైం అయినప్పటికీ కూడా షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని సైతం జవాన్ మూవీ తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

తాజా వార్తలు