వైరల్ అవుతున్న హిందీ ‘అర్జున్ రెడ్డి’ లుక్ !

Arjun1

‘అర్జున్ రెడ్డి’ చిత్రం తమిళ, హిందీ భాషల్లోకి కూడా గ్రాండ్ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా.. అక్కడ ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ లుక్‌ కు సంబంధించిన స్టిల్స్‌ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవుతున్నాయి. లుక్ చూస్తుంటే సినిమాలో కాలేజ్‌ కు సంబంధించిన సీన్స్‌ లోని లుక్ లా అనిపిస్తోంది. ఇక ఈ లుక్‌ మాత్రం నేటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కించనున్నారు.

Exit mobile version