“కబీర్ సింగ్” వసూళ్లే కాదు,వివాదాలు కూడా అదే రేంజ్ లో…!

Published on Jun 27, 2019 1:50 pm IST

షాహిద్ కపూర్ నటించిన “కబీర్ సింగ్”మూవీకి వసూళ్ల రేంజ్ కి మించిన వివాదాలు చుట్టుముడుతున్నాయి. విడుదలైన మొదటి ఆటనుండే ఈ సినిమాపై చాలా మంది అభ్యంతరం తెలపడం మొదలుపెట్టారు. సెన్సార్ బోర్డు సభ్యురాలైన వాణి త్రిపాఠీ ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ చిత్రం మేల్ డామినేషన్ ని ప్రోత్సహిస్తున్నట్లుందని, అలాగే ఆడవాళ్లను తక్కువగా చూపించడంతో పాటు, మహిళల మనోభావాలు తెబ్బతినేలా చిత్ర కథ ఉందని వ్యతిరేకత వ్యక్తం చేశారు.

తాజాగా ముంబైకి చెందిన ప్రముఖ వైద్యుడు ప్రదీప్ గాడ్గే హీరో మద్యంతాగి వైద్యం చేసే సన్నివేశాలు ప్రజల్లో వైద్యుల పట్ల చెడు భావన కలిగేలా చేస్తుందని,ఇప్పటికే ప్రజల్లో వైద్యుల పట్ల నెగెటివ్ ఒపీనియన్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి చిత్రాల వలన అది ఇంకా పెరిగే అవకాశముంది,కావున వెంటనే ఈ మూవీ ప్రదర్శన నిలిపివేయాలని,లేదంటే చట్టపరమైన చర్యలకు బాద్యులు అవుతారని తెలిపారు.

ఐతే ఈ విమర్శలతో, క్రిటిక్స్ రేటింగ్స్ తో సంబంధం లేకుండా చిత్ర వసూళ్లు జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాయి.ఇప్పటీకే 100 కోట్ల మార్కుని దాటేసిన ఈ మూవీ 200 కోట్లు ఫుల్ రన్ లో చేరుకోవడం అసాధ్యమేమీ కాదని ట్రేడ్ పండితుల వాదన.

సంబంధిత సమాచారం :

X
More