హిందీ “అర్జునరెడ్డి” కూడా దుమ్మురేపుతున్నాడుగా…!

Published on Jun 22, 2019 11:01 am IST


షాహిద్ కపూర్,కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ”కబీర్ సింగ్” నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున రెడ్డి” మూవీకి హిందీ అనువాదంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ముఖ్యంగా హీరో షాహిద్ కి అటు నటన పరంగా, వసూళ్ల పరంగా కెరీర్ బెస్ట్ మూవీ కావడం ఖాయం అంటున్నారు.ఈ మూవీకి ప్రేక్షకుల నుండి సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. షాహిద్ అద్భుత నటనకి దర్శకుడు వంగా సందీప్ రెడ్డి ప్రతిభ తోడవ్వడంతో సినిమా తెరపై గొప్పగా ఆవిష్కృతమైనది.

కలెక్షన్స్ పరంగా కూడా “కబీర్ సింగ్” మొదటి రోజు దుమ్ముదులిపింది. 20కోట్ల షేర్ తో ఈ సంవత్సరానికి రెండవ అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. ఈ మొత్తం సంజయ్ లీలా భన్సాలీ దర్శకతంలో దీపికా,రణ్వీర్ సింగ్,షాహిద్ నటించిన “పద్మావతి” మూవీ కంటే ఎక్కువ. పద్మావతి మూవీ మొదటి రోజు కేవలం 18.21 కోట్లు మాత్రమే రాబట్టింది. ఏదేమైనా షాహిద్ చాలా కాలం తరువాత “కబీర్ సింగ్”తో సాలిడ్ హిట్ అనుకుంటున్నారు అందరు.

సంబంధిత సమాచారం :

More