ఫ్రీ టికెట్ అడిగినందుకు ఫ్యాన్ కి క్లాస్ పీకిన షారుఖ్.!

ఫ్రీ టికెట్ అడిగినందుకు ఫ్యాన్ కి క్లాస్ పీకిన షారుఖ్.!

Published on Sep 3, 2023 4:40 PM IST

Shah Rukh Khan

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ చిత్రం “జవాన్”. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార మరియు దీపికా పదుకోన్ లు నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం షారుఖ్ నుంచి సెన్సేషనల్ హిట్ పఠాన్ అనంతరం వస్తుండడంతో మరింత హైప్ నెలకొంది.

ఇక జవాన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్న షారుఖ్ మరోసారి తన సోషల్ మీడియాలో ఆస్క్ సెషన్ పెట్టగా అందులో ఓ అభిమాని తనకి అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కి జవాన్ ఫ్రీ టికెట్స్ కావాలి ఇప్పించండి అని షారుఖ్ ని అడగగా షారుఖ్ అయితే దీనికి సీరియస్ రిప్లై అందించాడు.

“ఫ్రీ గా ప్రేమ మాత్రమే దొరుకుతుంది భాయ్..టికెట్ కావాలంటే పైసా పెట్టాలి. రొమాన్స్ విషయంలో ఎప్పుడూ చీప్ గా ఉండకూడదు. వెళ్లి టికెట్ కొనుకో నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి” అంటూ షారుఖ్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. దీనితో ఈ ఊహించని రిప్లై అయితే వైరల్ గా మారింది.

తాజా వార్తలు