శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తి చేశాడు !

శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తి చేశాడు !

Published on Aug 14, 2018 1:47 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ ఈ రోజుతో ముగిసింది. ఇటీవల గోవా లో తెరకెక్కించిన సాంగ్ తో చిత్రీకరణ మొత్తం పూర్తి అయింది. ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీని అందించారు.

మారుతీ తెరక్కిస్తున్న ఈ చిత్రంలో చైతు కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ శైలజా రెడ్డి పాత్రలో అలరించనుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. దాదాపు సంవత్సరం విరామం తరువాత విడుదలవుతున్న చైతు నటించిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు