షకీలా సినిమాకు క్లీన్ ‘యూ’.. ఆశర్యపరిచిన సెన్సార్ టీమ్.

Shakeela

మలయాళ శృంగార తారగా ఒకప్పుడు బాక్సాఫీస్ షేక్ చేసిన షకీలా గురించి బహుశా తెలియనివారంటూ ఎవరూ ఉండరు. షకీలా సినిమా విడుదల ఉంటే అప్పట్లో అక్కడి స్టార్ హీరోలు కూడా విడుదల వాయిదా వేసుకొనే వారు. ఆ రేంజ్ లో షకీలా ఆమె పాపులారిటీ ఉండేది. షకీలా ఏజ్ పెరగడం తో ఆమె క్రేజ్ తగ్గింది. ఆమె చాలా కాలంగా కామెడీ అండ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది.

తాజాగా ‘షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’ అనే మూవీలో షకీలా నటించింది. ఇందులో విక్రాంత్‌, పల్లవి ఘోష్‌ జంటగా నటిస్తున్నారు. సి.హెచ్‌.వెంకట్‌రెడ్డి నిర్మాత. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయిరాం దాసరి. ఓ భిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డ్ ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ అధికారులు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చి ఆశర్య పరిచారు. సాధారణంగా షకీలా ప్రధాన పాత్రలో అంటే అది ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్ మూవీ కాబట్టి ఏ సరిఫికేట్ వస్తుంది. దానికి భిన్నంగా తాజా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది.

Exit mobile version