షూటింగ్ స్పీడ్ పెంచిన “శాకుంతలం”.!

Published on Jul 15, 2021 12:18 am IST


టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా “శాకుంతలం”. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిగా కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. కాగా గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి గుణశేఖర్ సతీమణి నీలిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన సమంత ప్రీ లుక్‌కి మంచి స్పందన లభించింది.

సంబంధిత సమాచారం :