ఆకట్టుకుంటున్న శాకుంతలం వార్ వీడియో..!

Published on Aug 24, 2021 1:36 am IST

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “శాకుంతలం”. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి స‌మంత త‌న షూటింగ్ పార్టు పూర్తి చేసింది. కాగా ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

శాకుంతలంలో వ‌చ్చే యుద్ద స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. గుణ‌శేఖ‌ర్ అండ్ టీం. స్పెష‌ల్ సెట్ లో కొన‌సాగుతున్న వార్ సీన్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ చిత్రంకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :