ట్రైలర్ తో ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ ‘శంబాల’ !

ట్రైలర్ తో ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ ‘శంబాల’ !

Published on Dec 21, 2025 11:51 AM IST

Shambhala 1

విలక్షణ నటుడు ఆది సాయికుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన డిఫరెంట్ హారర్ ఎంటర్‌టైనర్ ‘శంబాల’కు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో నాని ఈ మూవీ కొత్త ట్రైలర్‌ ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ తో పాటు షార్ప్ షాట్స్ అండ్ సాలిడ్ బిజీఎమ్ తో చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఇచ్చిన నేటివిటీ టచ్ అండ్ ఎమోషన్ కూడా చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు