‘భారతీయుడు 2’ ఈ రోజు నుండే మొదలు !

‘భారతీయుడు 2’ ఈ రోజు నుండే మొదలు !

Published on Jan 18, 2019 9:03 AM IST

కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఈ రోజు నుండి చెన్నైలో ఘనంగా ప్రారంభం కానుంది. కాగా ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

మొత్తానికి టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ కూడా ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.

కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు