“భారతీయుడు 2” ఎందుకు అంత నిడివి? క్లారిటీ ఇచ్చిన శంకర్

“భారతీయుడు 2” ఎందుకు అంత నిడివి? క్లారిటీ ఇచ్చిన శంకర్

Published on Jul 9, 2024 5:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి రాబోతున్న మరో పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “భారతీయుడు 2” కోసం అందరికీ తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ ఇది కాగా తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమా కూడా శంకర్ అన్ని సినిమాల్లానే దాదాపు 3 గంటల నిడివి తోనే రాబోతుంది.

పైగా కొనసాగింపుగా మరో సినిమా కూడా ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అయితే సినిమా నిడివి కోసం కూడా శంకర్ క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో కట్ చేసి తగ్గించడానికి ఏమి లేదని అందుకే అంత రన్ టైం తో వస్తుంది అలాగే పార్ట్ 3 కూడా పాజిబుల్ అయ్యింది ని తేల్చేసారు. ఇలా మొత్తంగా మళ్ళీ శంకర్ నుంచి ఓ భారీ సినిమా రాబోతుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు