శంకర్ సినిమా ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ షూట్ లో చరణ్.!

Published on May 5, 2022 6:10 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా దర్శకుడు శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ మరియు శంకర్ ల కాంబోలో 15వ సినిమాగా పాన్ ఇండియా లెవెల్లో అనేక అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని అయితే దర్శకుడు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే చిత్ర యూనిట్ వైజాగ్ లో షూటింగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ షూట్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం చరణ్ పై కొన్ని తన కాలేజ్ నాటి సన్నివేశాలు ఆర్ కె బీచ్ ప్రాంతంలో తెరకెక్కిస్తున్నారు.

అలాగే చరణ్ కి మరియు పోలీసుల మధ్య ఒక చిన్న స్ట్రాంగ్ సీక్వెన్స్ ని కూడా శంకర్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూట్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొననున్నట్టు టాక్. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :